Sat Jan 31 2026 06:42:31 GMT+0000 (Coordinated Universal Time)
KCR : చాలా రోజుల తర్వాత కేసీఆర్ సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు హాజరు కానున్నారు.
దిశానిర్దేశం...
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ ఓటమి పాలయిన తర్వాత ఆయన బయటకు రాలేదు. తర్వాత యాక్సిడెంట్ కు గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ చాలా కాలం తర్వాత నేడు నేతలతో సమావేశమయి వారికి పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

