Mon Dec 15 2025 23:30:17 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు మెదక్ జిల్లాకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రోడ్ షో లో పాల్గొంటారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. వరస పర్యటనలతో కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో స్పీడ్ ను పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తూ తమకు అవకాశమిస్తే పార్లమెంటులో తెలంగాణ సమస్యలపై గళమెత్తేందుకు వీలుంటుందని కేసీఆర్ ప్రజలకు చెబుతూ వెళుతున్నారు.
సొంత జిల్లా కావడంతో...
ఈరోజు ఆయన మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రోడ్ షో లో పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్ గా మారిందనే చెప్పాలి. ఈ సభకు అత్యధిక సంఖ్యలో జనసమీకరణ చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.
Next Story

