Sun Mar 15 2026 13:25:35 GMT+0530 (India Standard Time)
KCR : నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ అధినేత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాలకు వెళ్లనున్నారు. ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటికి వెళ్లనున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాలకు వెళ్లనున్నారు. ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటికి వెళ్లనున్నారు. సంజయ్ కుమార్ ను పరామర్శించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యాయవాదిగా పేరుసంపాదించుకున్నారు.
పరామర్శ అనంతరం...
ఆయన మృతికి స్వయంగా వెళ్లి సంజయ్ కుమార్ కు సానుభూతి తెలిపేందుకు కేసీఆర్ జగిత్యాలకు వెళ్లనున్నారు. ఆయన ఇంటికి వెళ్లి సంజయ్ కుమార్ ను పరామర్శించిన అనంతరం తిరిగి ఫాం హౌస్ కు చేరుకుంటారు. జగిత్యాలకు కేసీఆర్ వస్తున్నాడని తెలిసి జిల్లాలోని పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున తరలి వస్తున్నారు.
Next Story

