Sun Dec 21 2025 00:30:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈ వారంలోనే ఢిల్లీకి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు సమాచారం అందించాయి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటి సారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు అన్నది మాత్రం బయటకు రాలేదు.
ఢిల్లీకి వెళ్లి ఎవరెవరిని?
ఆయన ఢిల్లీకి వెళ్లి ఎవరెవరిని కలవనున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పొత్తుతో బరిలోకి దిగుతాయని ప్రచారం వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Next Story

