Thu Mar 19 2026 18:03:26 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ లోకి ఒడిశా నేతలు
ఒడిశా నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు

ఇతర రాష్ట్రాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టారు. పొరుగున ఉన్నా రాష్ట్రాల నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవడంలో కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఒడిశా నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. మాజీ సీఎం గిరధర్ గమాంగ్, జయరామ్ పంఘీతో పాటు పలువురు నేతలను పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
మరాఠా నేత తో మర్యాదపూర్వక....
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు మాజీ పార్లమెంటు సభ్యుడు ఛత్రపతి శంభాజీ రాజే ప్రగతి భవన్ లో కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని తెలిపారు. నాందేడ్ లో వచ్చే నెల 5వ తేదీన భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో శంభాజజీ రాజే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

