Fri Mar 20 2026 01:04:01 GMT+0530 (India Standard Time)
KCR : నేడు రెండు జిల్లాలలకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కూడా మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కూడా మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బస్సు యాత్ర మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జరగనుంది. గత నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలుపర్చడం లేదని ఆరోపిస్తున్నారు.
కార్నర్ మీటింగ్ లలో...
బీజేపీకి ఓటేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈరోజు నర్సాపూర్, పటాన్ చెరులలో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో విమర్శల జోరును కూడా పెంచారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళం విప్పి సాధించుకుంటామని ఆయన చెబుతూ ముందుకు సాగుతున్నారు.
Next Story

