Sun Dec 21 2025 04:33:22 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు తెలంగాణ భవన్ లో కేసీఆర్ కీలక సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం నేడు తెలంగాణ భవన్ లో జరగనుంది. దీంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీజలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు.
జలాల విషయంలో ఉద్యమ కార్యాచరణ...
ప్రధానంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు సాగునీటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందులో భాగంగా నేతలతో చర్చించి కేసీఆర్ దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సమావేశానికిఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని కోరారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన అనంతరం కేసీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈసమావేశంలో కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశముంది.
Next Story

