Thu May 09 2024 00:02:02 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు నాగర్‌కర్నూలుకు కేసీఆర్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు
ీబీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి బస్సు యాత్రలో జిల్లాలను చుట్టివస్తున్న కేసీఆర్ నేడు నాగర్ కర్నూలుకు చేరుకుని అక్కడ జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు.
రోడ్ షోలో....
అనంతరం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నేతలతో సమావేశమై గెలుపు పై అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేయనున్నారు. నాగర్ కర్నూల్ లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్ వరకూ కేసీఆర్ రోడ్ షో సాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ జరిగే సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
Next Story