Sun Mar 15 2026 10:54:08 GMT+0530 (India Standard Time)
KCR : వారి ట్రాప్లో పడొద్దు.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన
ఎవరో ఏదో చెబితే ట్రాప్ లో పడొద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

ఎవరో ఏదో చెబితే ట్రాప్ లో పడొద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొందరు ఎమ్మెల్యేలు కలవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మంచి ఆలోచనలతో కలిసినా దానికి వేరు కలరింగ్ అద్దుతారని, అందుకే జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల్లోకి తప్పుుడు సంకేాలు వెళతాయని అన్నారు.
జాగ్రత్తగా ఉండాలంటూ...
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కేసీఆర్ తన ఇంట్లో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వమని తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.
Next Story

