Thu Mar 19 2026 07:44:57 GMT+0530 (India Standard Time)
KCR : ఎండిన పంటలను చూసిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు చేరుకున్నారు. ఆయన ముగ్దుంపూర్ లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు చేరుకున్నారు. ఆయన ముగ్దుంపూర్ లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పొలాలకు నీరు రాకపోవడంతోనే పంటలు ఎండిపోయిన విషయాన్ని రైతులు ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో అన్ని వేళలా తమ పొలాలకు నీళ్లు అందేవని, కానీ ఇప్పుడు నీరు రాకపోవడంతో పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే కేసీఆర్ ఇందుకు సమాధానమిస్తూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రైతులతో ముఖాముఖి...
రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. రెండు గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత నాలుగు గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడతారు. కేసీఆర్ పర్యటనకు రావడంతో జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Next Story

