Sun Feb 01 2026 04:45:30 GMT+0000 (Coordinated Universal Time)
KCR : తొలిసారి కవిత అరెస్ట్ పై మాట్లాడిన కేసీఆర్.. అందుకే అరెస్ట్ అంటూ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ పై కేసీఆర్ తొలిసారి మాట్లాడారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక పెద్దనేత కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత తనతో ఈ కామెంట్స్ చేశారంటూ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకు...
అలాగే కవిత అరెస్ట్ పై కేసీఆర్ తొలిసారి మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమమన్న ఆయన, ఎలాంటి ఆధారాలు లేకపోయినా కావాలనే కవితను అరెస్ట్ చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో కూల్చే కుట్రకు పాల్పడినందుకు బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపామని, దానిపై కక్ష కట్టిన మోదీ కవితను లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని అన్నారు.
Next Story

