Fri Dec 05 2025 07:11:43 GMT+0000 (Coordinated Universal Time)
KCR : మూడోసారి నేడు ఖమ్మం జిల్లాకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగూడెం, ఖమ్మం పట్టణాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడోసారి ఆయన ఖమ్మం జిల్లాకు వస్తున్నారు. ఖమ్మం జిల్లా కొంత బలహీనంగా ఉందని భావిస్తున్న ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన సభలకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేసీఆర్ నేడు మరోసారి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
ప్రజా ఆశీర్వాద సభల్లో....
నేడు కేసీఆర్ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ కేసీఆర్ పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈరోజు జరిగే సభల్లో కాంగ్రెస్ పై మరోసారి విరుచుకు పడనున్నారు. ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో జనసమీకరణను చేసేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందుగా రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు.
Next Story

