Fri Dec 05 2025 07:24:48 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రాష్ట్ర దశాబ్ది వేడుకలకు కేసీఆర్ ఏం పిలుపు నిచ్చారంటే?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ నాటికి పదేళ్లు కావస్తున్న సందర్భంలో వేడుకలను పార్టీ అత్యంత ఘనంగా నిర్వహించాలని డిసైడ్ చేశారు. మొత్తం మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. జూన్ ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించాలని ఆయన నేతలను కోరారు.
మూడు రోజుల పాటు...
జూన్ ఒకటోతేదీన గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద నున్న అమరజ్యోి వరకూ రాత్రి ఏడు గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలన్నారు. 2వ తేదీన రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నివాళులర్పిస్తారు. ఆసుపత్రులు, అనాధ శరణాల్లో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించాలని నిర్ణయించనున్నారు.
Next Story

