Sun Mar 08 2026 01:05:28 GMT+0530 (India Standard Time)
KCR : నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో తన నామినేషన్ ను దాఖలు చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్ కు చేరుకున్న కేసీఆర్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందచేశారు. కేసీఆర్ మూడోసారి గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ నామినేషన్ సందర్భంగా పెద్దయెత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.
కామారెడ్డిలోనూ...
నామినేషన్ కు ముందుగానే రెండు రోజుల క్రితం ఆయన తన పత్రాలను కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉంచి పూజలను నిర్వహించారు. ఎర్రవెల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన కేసీఆర్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నామినేషన్ ను దాఖలు చేసిన అనంతరం ఆయన మరొక నామినేషన్ వేయడానికి కామారెడ్డి బయలుదేరి వెళ్లారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
Next Story

