Sun Mar 15 2026 03:15:07 GMT+0530 (India Standard Time)
KCR : లాస్య మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య మరణం బాధాకరమని ఆయన అన్నారు. లాస్య చిన్న వయసులోనే మరణించడం అత్యంత బాధకారమన్న కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తండ్రి చనిపోయిన ఏడాదికే కుమార్తె మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందన్నారు.
కుటుంబానికి అండగా...
లాస్య నందితకు రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉందని, అయితే అకాల మరణంతో ఆ కుటుంబం బాధను ఎవరూ తీర్చలేరని కేసీఆర్ అన్నారు. లాస్య కుటుంబ సభ్యులకు కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. లాస్య మరణించిందని తెలిసిన వెంటనే అమేధీ ఆసుపత్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేరుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు అనేక మంది అక్కడకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు.
Next Story

