Sat Jan 31 2026 19:33:18 GMT+0000 (Coordinated Universal Time)
ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే
ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే కేసీఆర్ సెక్రటేరియట్ ను తాజ్ మహల్ గా మార్చారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెక్రటేరియట్ ను తాజ్ మహల్ గా మార్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం డోమ్ ను కూల్చేస్తామని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి వస్తే...
కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఉట్టిపడేలా చేస్తామని బండి సంజయ్ అన్నారు. కేవలం ఒవైసీ కుటుంబాన్ని మెప్పించడం కోసమే కేసీఆర్ సచివాలయానికి ఈ డిజైన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని అన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మారుస్తామని తెలిపారు.
- Tags
- bandi sanjay
- kcr
Next Story

