Mon Mar 16 2026 03:00:18 GMT+0530 (India Standard Time)
BRS : మరో ఇద్దరికి కేసీఆర్ ఎంపీ టిక్కెట్లు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ఇద్దరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ఇద్దరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.
ఐఏఎస్..ఎమ్మెల్సీ.. ఎంపీ అభ్యర్థి...
వెంకట్రామిరెడ్డి కూడా ఐపీఎస్ అధికారిగా ఉండి వీఆర్ఎస్ తీసుకుని బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కేసీఆర్ గతంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయనను మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. వరసగా బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర ప్రకటిస్తూ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు.
Next Story

