Fri Dec 05 2025 17:39:22 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ఎవరూ రావద్దు.. దయచేసి కోరుకుంటున్నా
బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పార్టీ నేతలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పార్టీ నేతలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తన పట్ల అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే మీ ముందుకు వస్తానని ఆయన తెలిపారు. ఎక్కువ మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి వస్తుండటంతో ఇక్కడ ఉన్న రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారని కోరారు.
తోటి రోగులు....
దయచేసి పార్టీ అభిమానులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. తనతో పాటు ఉన్న వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకూడదని ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే మీ ముందుకు వస్తానని, ఆసుపత్రికి దయచేసి ఎవరూ రావద్దని కోరారు. కాలు జారి కింద పడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఈ విధంగా కోరారు.
Next Story

