Thu Feb 19 2026 12:28:39 GMT+0530 (India Standard Time)
నేడు బీఆర్ఎస్ మంచిర్యాల బంద్
నేడు మంచిర్యాల జిల్లా బంద్కు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది.

నేడు మంచిర్యాల జిల్లా బంద్కు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది. బాల్క సుమన్ అరెస్ట్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపు నిచ్చింది. చెన్నూరులో కొన్ని వ్యాపార సంస్థలను బీఆర్ఎస్ నేతలు కొందరు బలవంతంగా మూసి వేయిస్తున్నారు. చెన్నూరు పట్టణంలో 144వ సెక్షన్ విధించారు. బంద్ పేరుతోబలవంతంగా, దౌర్జన్యంగా దుకాణాలు బంద్ చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
చెన్నూరు పట్టణంలో...
చెన్నూరు పట్టణంలో బంద్ పై ఎమ్మార్వో ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా, దౌర్జన్యంగా వ్యాపారాలను మూసివేయించినా, అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలను చేపట్టినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరసనలు తెలియజేయాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు. మరొకవైపు నేడు ఆదిలాబాద్ జైలుకు మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లి రిమాండ్ లో ఉన్న బాల్క సుమన్ ను కలుసుకుంటారు.
Next Story

