Fri Jan 02 2026 14:13:45 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ తప్పు మీద తప్పులు చేస్తుందా?
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి తప్పు చేసిందనుకోవాలి

బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి తప్పు చేసిందనుకోవాలి. కృష్ణా నదీ జలాలు, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంపై సభలో మాట్లాడి నిజాలను తెలియజేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ సమావేశాలను బహిష్కరించి ఒకరకంగా సెల్ఫ్ గోల్ వేసుకుంది. తన వాదనలను వినిపించుకోవాల్సిన సమయంలో వెనకడుగు వేసి తాను ఈ ప్రాజెక్టు విషయంలో సరైన వాదనలు వినిపించలేక చేతులెత్తేసిందన్న కామెంట్స్ ను ఎదుర్కొనాల్సి వచ్చింది. పాలమూరు ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయం ఇప్పుడు వికటించింది. తెలంగాణ నీటి ప్రయోజనాలను బీఆర్ఎస్ రాజకీయం కోసం రిస్క్ లో పెడుతోందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. పాలమూరుపై ప్రేమ ఉన్నట్లుగా చూపిస్తూ అసలే పనులు జరగకుండా చేస్తోందంటున్నారు.
అనుమతులు అవసరమే...
ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే అనుమతులు, నిధులు అవసరం ఉంటుంది. కేసీఆర్ చేయగలిగినంత అప్పు చేసి కాళేశ్వంర మీద పెట్టుబడి పెట్టి వెళ్లారు. మరి పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న సహజంగా తలెత్తుంది. ఎనభై వవేల కోట్ల ఖర్చులో 27వేల కోట్లు ఖర్చు మాత్రమే పెట్టారని, ఆలస్యమయ్యే కొద్దీ అంచనాలు పెరుగుతూంటాయి. ప్రభుత్వం ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సామర్థ్యం, నీటి కేటాయింపులు, రుణాల సేకరణపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అటు అభివృద్ధికి, ఇటు రాజకీయ యుద్ధానికి వేదికవుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ప్రాజెక్టును 45 టీఎంసీల సామర్థ్యంతో చూపడం వెనుక బలమైన ఆర్థిక, సాంకేతిక కారణాలు కనిపిస్తున్నాయి.
రుణాలను పొందాలన్నా...
అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలన్నా, కేంద్రం నుంచి పర్యావరణ , జలవనరుల అనుమతులు వేగంగా రావాలన్నా క్లీన్ అండ్ క్లియర్ ప్రాజెక్టుగా ఉండటం అవసరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పెట్టిన భారీ పెట్టుబడులను, పాత అప్పులను తక్కువ వడ్డీ రేట్లకు మార్చుకోవడం ద్వారా ఖజానాపై భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 45 టీఎంసీల వాదన తీసుకు వచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రతిపాదించింది 90 టీఎంసీలు. లక్ష్యం 90 టీఎంసీలు అయినప్పుడు, కేవలం సగం సామర్థ్యానికే పరిమితం కావడం అంటే మిగిలిన సగం వాటాను వదులుకోవడమేనా? అని బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజేస్తోంది. పదిహేను రోజులు సభ పెట్టాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలు చివరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి వెళ్లడంపై ప్రజలు కూడా ఒకరకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Next Story

