Sun Apr 05 2026 19:22:24 GMT+0530 (India Standard Time)
Breaking : కాంగ్రెస్ కు షాక్.. ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీదే
ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్, బీజేపీ కైవసం చేసుకుంది

ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్, బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ - బీజేపీ కలసి ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా బీజేపీకి చెందిన మౌనిక ఎన్నికయ్యారు. అనేక కారణాలతో ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంది.
రెండు పార్టీలు కలవడంతో...
నిన్న కూడా రెండు పార్టీలకూ సమాన ఓట్లు రావడంతో నేటికి వాయిదా పడింది. దీంతో ఈరోజు తిరిగి అధికారులు ఎన్నికను నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు మద్దతు ఇవ్వడంతో వారు ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మౌనికకు బీఆర్ఎస్ సభ్యులు మద్దతుగా నిలవడంతో బీజేపీ పరమైంది. వైస్ ఛైర్మన్ ను బీఆర్ఎస్ అభ్యర్థికి కేటాయించనున్నారు.
Next Story

