Fri Dec 05 2025 22:01:58 GMT+0000 (Coordinated Universal Time)
ప్రీతి ఘటనపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
వరంగల్ కు చెందిన మెడికో ప్రీతి ఆత్మహత్యపై ఆమె సోదరుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు

వరంగల్ కు చెందిన మెడికో ప్రీతి ఆత్మహత్యపై ఆమె సోదరుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు కొద్దిసేపటి క్రితం పృథ్వీ వీడియోను విడుదల చేశారు. తన సోదరి ప్రీతిది ఆత్మహత్య కాదని ఆయన తెలిపారు. ప్రీతి చేతిపై గాయం ఉందని, పొత్త కడుపుపై సర్జరీ ఎందుకు చేశారని పృథ్వీ ప్రశ్నించారు. తన సోదరి ప్రీతికి, సైఫ్ కి కౌన్సెలింగ్ ఇచ్చామని అధికారులు చెబుతుందంతా అబద్ధమని ఆయన అన్నారు.
నిమ్స్ లో అందించిన వైద్యంపై...
తన సోదరిని పిలిచి హెచ్వోడీ వివరణ అడగకుండానే తిట్టడం ఏంటని నిలదీశారు. సైఫ్ కు మద్దతిస్తున్న నాగార్జున రెడ్డితో కమిటీని ఏర్పాటు చేస్తే ఇక న్యాయం ఎలా జరుగుతందని పృథ్వీ ప్రశ్నించాడు. ప్రీతికి పూర్తిగా బ్లడ్ డయాలసిస్ చేశారని కూడా పృథ్వీ తెలిపారు. డయాలసిస్ చేస్తే పోస్ట్మార్టంలో ప్రీతి శరీరంలో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుందన్నారు. నిమ్స్ లో జరిగిన వైద్యం గురించి తమకు చెప్పాలని ఆయన కోరారు.
Next Story

