Fri Dec 05 2025 09:14:12 GMT+0000 (Coordinated Universal Time)
సీతారాములకల్యాణానికి వచ్చే భక్తులకు తిరుమల లడ్డూ
ఒంటిమిట్ట లోని శ్రీకోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఒంటిమిట్ట లోని శ్రీకోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన సీతారామలు కల్యాణం ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకూ సీతారాముల కల్యాణం జరుగుతుంది. రాముల వారి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
హాజరయ్యే భక్తుల కోసం...
ఈ నేపథ్యంలో ఈ సీతారాముల కల్యాణానికి హాజరయ్యే భక్తులకు తిరుమల లడ్డూలను అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా డెబ్బయి వేల లడ్డూలను టీటీడీ పంపిణీచేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాక్ చేయించి మరీ లడ్డు ప్రసాదాలను భక్తులకు అందించనుంది. శ్రీవారి సేవకులు ఈ లడ్డూలను ప్యాక్ చేశారు. వీటిని ఒంటిమిట్టకు చేర్చి ఎల్లుండి సీతారాముల కల్యాణానికి హాజరయ్యే భక్తులకు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

