Fri Feb 13 2026 16:27:48 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ కు బూస్ట్ ఇచ్చిన సిరిసిల్ల
సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 39 వార్డులుండగా అందులో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 27 స్థానాల్లో విజయం సాధించడంతో సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ పరమయింది. ఇక్కడ కారు పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు.
మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే...
కాంగ్రెస్ ఐదు చోట్ల, స్వతంత్రులు ఒక చోట గెలిచారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నిక కానున్నారు. ఈ మున్సిపాలిటీని గెలుచుకోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కేటీఆర్ వైపు సిరిసిల్ల ప్రజలు నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా చాటినా బీఆర్ఎస్ సిరిసిల్ల మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఒక రకంగా బీఆర్ఎస్ కు బూస్ట్ ఇచ్చినట్లయింది.
Next Story

