Sat Dec 13 2025 22:34:53 GMT+0000 (Coordinated Universal Time)
BRS : స్పీకర్ కోర్టు థిక్కారంపై సుప్రీంకోర్టుకు కేటీఆర్
తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు థిక్కారానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు

తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు థిక్కారానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతను తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసప్పటికీ నానుస్తూ విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని కేటీఆర్ పిటీషన్ లో పేర్కొన్నారు.
గడువు ముగిసినా...
అయితే అక్టోబరు 31వ తేదీతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. కానీ స్పీకర్ కార్యాలయం కార్యదర్శి తమకు మరో రెండు నెలల గడువు కావాలని పిటీషన్ వేశారు. ఇప్పటివరకూ నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే విచారించారు. మరొక ఆరుగురిని విచారించాల్సి ఉందని తెలిపారు. కేటీఆర్ వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది.
Next Story

