Tue Dec 09 2025 08:34:24 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : గవర్నర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు
తెలంగాణ లోక్ భవన్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి

తెలంగాణ లోక్ భవన్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు దిగారు.గవర్నర్ నివాసంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో గవర్నర్ కార్యాలయ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ వచ్చిందని తెలిపారు.
తనిఖీలు నిర్వహిస్తూ...
దీంతో పోలీసులు, బాంబ్ స్క్కాడ్ వచ్చి గవర్నర్ కార్యాలయంలోనూ, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కావాలనే ఆకతాయిల పనిగా కొట్టిపారేసినా కావాలని చేసిందెవరు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story

