Fri Dec 05 2025 13:03:07 GMT+0000 (Coordinated Universal Time)
పాస్టర్ ముసుగులో పాడుపనులు.. మారువేషంలో వచ్చిన భార్య?
పాస్టర్ గా ఉంటూ.. ప్రజలకు హితబోధ చేస్తున్న జయరాజ్ అనబడే పాస్టర్ ఏకంగా తనవద్దకు ప్రార్థనలకు వచ్చే మహిళలతో అక్రమ సంబంధం..

పేరుకే అతనొక పాస్టర్. ఆ ముసుగులో ఉంటూ.. తనవద్దకు వచ్చే మహిళల్లో ఎంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడో లెక్కేలేదు. భర్త రాసలీలల గురించి విన్న భార్య.. నిజంగా అతనేం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది. మారువేషంలో భర్త వద్ద వద్దకు పరాయి మహిళగా ప్రార్థనకు వెళ్లిన ఆమె.. భర్త మరో మహిళతో రాసలీలలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతో ఉన్న ఆ మహిళను జుట్టుపట్టి మరీ.. రోడ్డుపై పరుగెత్తించి పరుగెత్తించి మరీ కొట్టింది. ఈ ఘటన సంగారెడ్డిలోని బొల్లారంలో వెలుగుచూసింది.
పాస్టర్ గా ఉంటూ.. ప్రజలకు హితబోధ చేస్తున్న జయరాజ్ అనబడే పాస్టర్ ఏకంగా తనవద్దకు ప్రార్థనలకు వచ్చే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఈ ప్రబుద్ధుడి బుద్ధి వక్రీకరించిందని తెలుసుకున్న భార్య.. మారువేషంలో భర్త వద్ద ప్రార్థనలకు వెళ్లి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన భర్తతో మరో మహిళ కలిసుండటాన్ని ఏ భార్యైనా సహిస్తుందా ? ఇక్కడ కూడా అంతే.. ప్రార్థన కోసమని వచ్చిన ఓ మహిళ తన భర్తతో కలిసి ఉండటాన్ని చూసి సహించలేక.. ఆ మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేసింది. పారిపోబోతుంటే.. వెంబడించి మరీ కొట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో విషయం వెలుగుచూసింది. అయినా పాస్టర్ అంటే ఎంతో పవిత్రమైన స్థానంగా చూస్తారు. అలాంటి వృత్తిలో ఉంటూ.. ఛీఛీ.. ఇవేం పాడుపనులు అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
Next Story

