Tue Mar 17 2026 10:45:54 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ పై రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో టీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా నిలవరించాలని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు

తెలంగాణలో టీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా నిలవరించాలని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఇందిరా పార్కు వద్ద జరుగుతున్న కిసాన్ మహా పంచాయత్ లో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రాకేశ్ టికాయత్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ చెప్పేదొకటి, చేసేదొకటి అని ఆయన అన్నారు.
బీజేపీ కొమ్ము కాస్తూ....
టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ కొమ్ము కాస్తుందని రాకేశ్ టికాయత్ అన్నారు. టీఆర్ఎస్ ను తెలంగాణను దాటి రానివద్దని పిలుపునిచ్చారు. రైతులకు ద్రోహం చేసే ఏ పార్టీని కూడా వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని రాకేశ్ టికాయత్ పిలుపు నిచ్చారు. రైతులను మోసం చేసే పార్టీలను దగ్గరకు రానివ్వద్దని కోరారు.
- Tags
- rakesh tikait
- trs
Next Story

