Fri Dec 19 2025 19:36:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ డిక్లరేషన్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజు సమావేశాల్లో రాజకీయ వ్యవహారాలతో పాటు వ్యవసాయం, అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఈరోజు హైదరాబాద్ డిక్లరేషన్ చేసే అవకాశముందని తెలిసింది. ప్రధానంగా దేశంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు.
ఎనిమిదేళ్లుగా...
అలాగే గత ఎనిమిదేళ్లుగా దేశంలో జరిగిన అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి పై కూడా చర్చించనున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకాలు, నూతన వ్యవసాయ విధానం, రైతులకు లబ్ది వంటి అంశాలపై కొందరు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలు ఈరోజు సాయంత్రానికి ముగియనున్నాయి. ఈరోజు జాతీయ కార్యవర్గ సమావేశల్లో మోదీ ప్రసంగించే అవకాశముంది. నిన్ననే సమావేశాలకు వచ్చిన మోదీ వివిధ అంశాలపై జరిగిన చర్చను విన్నారు. ఈరోజు మరికొన్ని అంశాలపై చర్చ జరగనుంది.
Next Story

