Wed Jan 21 2026 00:58:28 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో బీజేపీ ముందంజ
మునుగోడు ఉప ఎన్నికల్లో పోరు హోరా హోరీగా సాగుతుంది. మూడో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యంలో ఉంది

మునుగోడు ఉప ఎన్నికల్లో పోరు హోరా హోరీగా సాగుతుంది. మూడో రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఐదు వందల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే చౌటుప్పల్ లోని అర్బన్ ప్రాంతంలో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు కనపడుతుంది.
ప్రతి రౌండ్ కు..
ప్రతి రౌండ్ కు ఫలితం మారుతుంది. తొలి, రెండు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చగా, మూడో రౌండ్ వచ్చే సరికి బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. దీంతో బీజేపీలో ఆశలు పెరిగాయి. కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు పోలవుతుండటం బీజేపీకి కొంత ఆందోళనకు గురిచేస్తుంది.
Next Story

