Sat Mar 07 2026 20:26:17 GMT+0530 (India Standard Time)
బండి పాదయాత్రలో టెన్షన్.. రాళ్లదాడి
బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు చేశారు. ఎవరికీ ఉద్యోగాలు రాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదుగురికి గాయాలు...
బీజేపీ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ క్యాడర్ మధ్య ఘర్షణ తలెత్తింది. టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు తలపై గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
Next Story

