Fri Dec 05 2025 20:59:13 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ నేడు మౌన దీక్ష
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు మౌన దీక్షచేపట్టనున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు మౌన దీక్షచేపట్టనున్నారు. ధరణి, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ఆయన 24 గంటల పాటు కరీంనగర్ లో దీక్ష చేపట్టనున్నారు. ఆయన దీక్షకు సంఘీభావంగా రాష్ట్రంలో 30 మంది నేతలు కూడా దీక్షలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ధరణి పోర్టల్ తో తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు...
అలాగే గిరిజనుల పోడు భూముల సమస్యలకు కూడా ఒక పరిష్కార మార్గం చూపాలని ఆయన ఈ దీక్ష చేస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ బైకు ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే 30 నియోజకవర్గాల్లో బీజేపీ భరోసా యాత్ర నిర్వహించనుంది. దీంతో పాటు ఆగస్టు 2వ తేదీ నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఇరవై రోజుల పాటు సాగే ఈ యాత్ర పలు నియోజకవర్గాల్లో సాగనుంది.
Next Story

