Mon Dec 08 2025 13:21:05 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్నవాళ్లను అరెస్ట్ చేసే దమ్ముందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతల పేర్లను తాను వెల్లడిస్తానని చెప్పారు. డ్రగ్స్ కేసులో సంబంద: ఉన్న బీజేపీ నేతలను అరెస్ట్ చేసుకోవచ్చని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.
బేవకూఫ్ గాళ్లని అంటారా?
త్వరలోనే హైదరాబాద్ ఫైల్స్ సిినిమా చూపిస్తానని బండి సంజయ్ అన్నారు. తాగి బండి నడిపితే నేరం.. మరి తాగి రాష్ట్రాన్ని నడిపై సీఎంను ఏమనాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే బేవకూఫ్ గాళ్లని అంటారా? అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
- Tags
- bandi sanjay
- kcr
Next Story

