Thu Mar 19 2026 00:31:47 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు పిచ్చి పట్టింది
ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిచ్చి పట్టిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిచ్చి పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతులు పండించే ప్రతి గింజను కొనాల్సిందేనన్నారు. ఎలా కొనవో చూస్తామని బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. కేసీఆర్ భాష చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. ముడి బియ్యం కొంటామని ఇప్పటికే చెప్పినా మళ్లీ కొంటావా? లేదా? అనే ప్రశ్న ఎందుకు వేస్తున్నారని బండి సంజయ్ నిలదీశారు.
ఇతర రాష్ట్రాలలో...
వానాకాలం పంట కొంటానని చెప్పినప్పుడు యాసంగి పంట ఎందుకు కొనవని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతులను మభ్య పెట్టేందుకు రోజుకో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్యలు తెలంగాణలోనే ఎందుకున్నాయని ఆయన అన్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి దిగజారుడు భాష మాట్లాడటం తగదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు చేయకుండా నువ్వు తప్పించుకోలేవని కేసీఆర్ పై బండి సంజయ్ ధ్వజమెత్తారు.
- Tags
- bandi sanjay
- kcr
Next Story

