Sat Dec 06 2025 12:23:23 GMT+0000 (Coordinated Universal Time)
టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే ఉంటా
కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు

కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నలుగురు ఎమ్మెల్యేలతో సర్కస్ చేయించినా ఫలితం ఉండబోదన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలను కేసీఆర్ నాశనం చేశారన్నారు. ఉద్యోగ సంఘ నేతలకు సిగ్గుండాలన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్లకింద తాకట్టు పెట్టారన్నారు. ఉద్యోగులను సంఘం నాయకులు మోసం చేస్తున్నారన్నారు. ఉద్యోగులు లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నా సంఘ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. హెడ్ మాస్టర్లతో ముఖ్యమంత్రి బాత్రూం లను కడిగించారన్నారు. నన్ను కెలికితే తాను ఇంకా కెలుకుతూనే ఉంటానని ఆయన తెలిపారు.
క్షమాపణ చెప్పేదే లేదు...
తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవరూ బలి కావద్దన్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు తాను క్షమాపణ చెప్పబోనని ఆయన అన్నారు. ఒకరు పాస్ పోర్ట్ కుంభకోణంలో ఉంటే, మరొకరు ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నారని ఆయన అన్నారు. మీ ఆస్తుల మొత్తాన్ని బయటపెడతానని ఉద్యోగ సంఘ నేతలను హెచ్చరించారు. ఒక్కరోజైనా నెల మొదటి తేదీన జీతాలు పడాలని ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. టీఎన్జీవో నేతలు నలుగురు ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. తాను ఇంకా తిడుతూనే ఉంటానని తెలిపారు. టీఎన్జీవో నేతలకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన అన్నారు.
Next Story

