Mon Apr 21 2025 18:16:12 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ లో సభ నిర్వహించి తీరతాం
ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు

ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. దీక్ష ముగించిన అనంతరం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ ను పక్కదోవ పట్టించేందుకే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్నారు.
మతఘర్షణలకు...
వరంగల్ లో ప్రజాసంగ్రామ ముగింపు సభ జరిపి తీరుతామని బండి సంజయ్ తెలిపారు. జేపీ నడ్డా ఈ సభకు హజరవుతారని ఆయన తెలిపారు. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుంటే టీఆర్ఎస్ మత ఘర్షణలను లేపే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కామ్ లో చిక్కుకుందన్నారు. వాటి నుంచి బయటపడేందుకు ఈ రకమైన ప్రయత్నాలను ప్రారంభించిందని బండి సంజయ్ అన్నారు.
Next Story