Wed Mar 18 2026 23:04:12 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు పిచ్చి పట్టే అలా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలారన్నారు. పిచ్చి పట్టిన కేసీఆర్ బడ్జెట్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు. కేసీఆర్ భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగడం తగదని ఆయన హితవు పలికారు. కేసీఆర్ పాలనపై అసంతృప్తి ఉందని గ్రహించి కొత్త నాటకానికి తెరతీశారని చెప్పారు.
రైతుల ఆత్మహత్యలు.....
కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిన కేసీఆర్ రైతు ద్రోహి అని ఆయన విమర్శించారు. ఉచితం పురుగు మందులు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. 317 జీవోను కేసీఆర్ సమర్థించుకోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. ఆ జీవో కరెక్ట్ అయితే పది మంది ఎందుకు చనిపోతారని ఆయన ప్రశ్నించారు.
- Tags
- bandi sanjay
- kcr
Next Story

