Sun Mar 08 2026 04:45:17 GMT+0530 (India Standard Time)
బండి పాదయాత్ర ఈరోజు ఎక్కడంటే?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు భైంసా శివారు ప్రాంతం నుంచి బయలుదేరింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు భైంసా శివారు ప్రాంతం నుంచి బయలుదేరింది. ఈరోజు బండి సంజయ్ తన పాదయాత్రను 12 కిలోమీటర్ల మేర కొనసాగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గుండెగాం, మహాగాం, చాత గ్రామాల గుండా సాగే ఈ యాత్ర లింబా (బి) గ్రామానికి చేరుకుని రాత్రి బస అక్కడ చేయనున్నారు.
ప్రజల సమస్యలను...
బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున తరలి వచ్చారు. ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర ను కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వస్తుండటంతో యాత్ర కొంత నిదానంగా నడుస్తుంది. ఎక్కడికక్కడ పార్టీ నేతలు జనసమీకరణ చేసి బండికి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. గుండెగావ్ ప్రజలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు.
Next Story

