Fri Dec 05 2025 13:43:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ కోమటిరెడ్డి మాతో టచ్ లో ఉన్నారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమతో టచ్ లో ఉన్నారన్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమతో టచ్ లో ఉన్నారన్నారు. మునుగోడుతో పాటు మరికొన్న చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తాయని ఆయన తెలిపారు. అనేక మంది నాయకులు తమతో టచ్ లో ఉన్నారన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అందుకే మోదీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గానికి సంబంధించి చాలా నిధులు తీసుకెళ్లారన్నారు.
మరికొన్ని చోట్ల కూడా....
మునుగోడుతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఉప ఎన్నికలు వస్తాయని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారని తెలిపారు. మునుగోడులో గెలుపు తమదేనని అన్నారు. చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని బండి సంజయ్ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
HeadingContent Ara
Next Story

