Mon Dec 08 2025 14:22:59 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఒక చెల్లని రూపాయి
బీజేపీ, కేంద్రంపైనా విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

బీజేపీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని బండి సంజయ్ అన్నారు. అంతా అబద్ధాలు చెబుతూ మరోసారి సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోకి వద్దామని కలలు కంటున్నారని బండి సంజయ్ అన్నారు.
ఢిల్లీలో కథలు చెప్పినా....
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చెల్లని రూపాయిగా ఆయన అభివర్ణించారు. ఆయనను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరని, ఢిల్లీకి వెళ్లి కధలు చెప్పినా కేసీఆర్ ను ఎవరూ విశ్వసించరని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే నిన్న కేసీఆర్ జనగామలో సభ పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని, అందుకే ఆయన సెంటిమెంట్ ను రగిలించేందుకు ప్రయత్నిస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీని పిడికెడుగా మాట్లాడుతున్న కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
- Tags
- bandi sanjay
- kcr
Next Story

