Thu Dec 18 2025 23:06:51 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ హౌస్ అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుదలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ లో బీజేపీ నేతలు ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు బండి సంజయ్ రెడీ అవుతుండటంతో ఆయనను ఇంట్లోనే అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసినా....
బండి సంజయ్ జేబీఎస్ కు వెళ్లకుండా ఇంట్లోనే నిర్భంధించారు. అయితే తనను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజల కోసం పార్టీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఛార్జిల పెంపుపై ఈరోజు ధర్నాలు చేసి తీరుతామని బండి సంజయ్ ప్రకటించారు. కనీసం ఈ ప్రభుత్వ హయాంలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి అక్రమ అరెస్ట్ ను ఆయన ఖండించారు.
Next Story

