Sun Mar 22 2026 13:20:37 GMT+0530 (India Standard Time)
బండి సంజయ్ కు ఊరట.. పాదయాత్రకు లైన్ క్లియర్
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఊరట లభించింది. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఊరట లభించింది. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వర్ధన్న పేట ఏసీపీ ఇచ్చిన నోటీసులని సస్సెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. రెండు రోజుల క్రితం జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర జరుపుతుండగా ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు కరీంనగర్ కు తరలించారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
వరంగల్ లో సభ యధాతధం...
అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. శాంతియుతంగా జరుగుతున్న యాత్రను పోలీసులు కావాలని అడ్డుకుంటున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే వర్ధన్నపేట ఏసీపీ మాత్రం బండి సంజయ్ పాదయాత్ర వల్ల శాంతిభద్రతలు తలెత్తుతాయని బండి సంజయ్ కు ఇచ్చిన నోటీసులను కోర్టు సస్పెండ్ చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం వరంగల్ లో బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ జరగనుంది.
Next Story

