Sat Mar 07 2026 21:01:27 GMT+0530 (India Standard Time)
రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ కేసు.. తరుణ్ చుగ్
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై కర్ణాటకలో డ్రగ్స్ కేసు ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై కర్ణాటకలో డ్రగ్స్ కేసు ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఆయనకు డ్రగ్స్ పంపిణీ చేసిన వారితో సంబంధాలున్నాయన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఒక కట్టుకధ అని తరుణ్ చుగ్ కొట్టిపారేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహం రచించి ఈ కొనుగోలు వ్యవహారాన్ని రచించారన్నారు.
బీజేపీకి ఎలాంటి...
ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. బీజేపీపై దుష్ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ది పొందడానికి ప్రయత్నించిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓట్లు వేయించడాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
Next Story

