Sat Mar 07 2026 17:39:52 GMT+0530 (India Standard Time)
BJP : రైతు సమస్యలపై బీజేపీ ఆందోళన
రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆందోళనకు దిగింది.

రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆందోళనకు దిగింది. కరీంనగర్ లో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆందోళనకు దిగారు.
ఆరు గ్యారంటీలను...
వరికి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆరు హామీలు అమలు చేయాలని, లేకుంటే మరింత ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని సాకులు చెప్పవద్దని అన్నారు.
Next Story

