Sun Mar 15 2026 07:42:42 GMT+0530 (India Standard Time)
BJP : టీడీపీ మా భాగస్వామి కాదు
నవంబరు 7న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు

నవంబరు 7న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఆరోజు తెలంగాణలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ జరుగుతుందని, ఆ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమ భాగస్వామి కాదన్న లక్ష్యణ్, జనసేనతో మాత్రం పొత్తులో ఉన్నామని తెలిపారు.
7న తెలంగాణకు ప్రధాని...
జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని అన్న లక్ష్మణ్ పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులుంటాయని తెలిపారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వ్యూహం వల్లనే గెలిచామని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని, పొత్తుల్లో కొన్ని సీట్లు భాగస్వామ్య పార్టీలకు ఇస్తామన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాలకే కాదు దేశ ప్రయోజనాలను కూడా తమ పార్టీ చూస్తుందని లక్ష్మణ్ తెలిపారు.
Next Story

