Mon Dec 08 2025 14:31:01 GMT+0000 (Coordinated Universal Time)
అంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే
ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై వాళ్ల దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, అవినీతి మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిన కేసీఆర్ ఆయనను రక్షిస్తూ, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ లోనే అవినీతి పరులు అందరూ ఉన్నారని బండి సంజయ్ అన్నారు. మంత్రి అవినీతిని బయటకు తీస్తుంటే కేసులు పెడుతున్నారన్నారు.
దాడి చేయాల్సిన అవసరమేంటి?
జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నారు. ఒక హత్య కుట్ర కేసును మహిళకు ముడిపెట్టడం దారుణమని చెప్పారు. పోలీసుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తాము అన్ని దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తామని చెప్పారు. తాము న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని బండి సంజయ్ అన్నారు.
- Tags
- bandi sanjay
- kcr
Next Story

