Sat Dec 06 2025 15:45:18 GMT+0000 (Coordinated Universal Time)
కవిత పెట్బుబడులు కోట్లలోనే.. బండి కామెంట్స్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందన్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. సారాతో పాటు క్యాసినోలోనూ కవిత పెట్టుబడులు పెట్టిందన్నారు. అవినీతికి పాల్పడుతూ అక్రమార్జనను ఇతర వ్యాపారాలకు కవిత తరలించారని ఆయన ఆరోపించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే...
అలాగే బండి సంజయ్ గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కూడా స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పట్ల ప్రజలు నమ్మారన్నారు. మోదీ చరిష్మాతో పాటు అక్కడ జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏకపక్షంగా ఓట్లు వేశారన్నారు. తెలంగాణలోనూ గుజరాత్ తరహా ఫలితాలు రావడం ఖాయమని, ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బండి సంజయ్ అన్నారు.
Next Story

