Sun Feb 01 2026 06:03:59 GMT+0000 (Coordinated Universal Time)
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శనకు అనుమతివ్వాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రతినిధులు, ఇంజినీరింగ్ నిపుణులు 30 మంది వరకూ తమ బృందంలో ఉంటారని ఆయన లేఖలో పేర్కొన్నారు. సెప్టంబరు మొదటి వారంలో తమ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటుందని లేఖలో పేర్కొన్నారు.
అనుమతివ్వండి...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఇటీవల వచ్చిన వరదలకు ముంపునకు గురవ్వడంపై పరిశీలన జరిపాలని భావిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై తమకు కొన్ని అనుమానాలున్నాయని, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు తమను ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వాలని కోరారు. తమ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Next Story

