Fri Dec 05 2025 09:28:04 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ పై ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ నిజామాబాద్ ఎమ్మెల్యే ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ నిజామాబాద్ ఎమ్మెల్యే ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు వచ్చే ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయదన్నారు.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదని నేను బాండ్ పేపర్ రాసిస్తానని తెలిపారు. అర్ధరాత్రి తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఘటనను రేవంత్ మర్చిపోయారా.? అని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది...
తెలంగాణలో బీఆర్ఎస్ లేదు, దాని పని అయిపోయిందని ధర్మపురి అరవింద్ చెప్పారు. బీఆర్ఎస్ కు ఎక్ప్రైరీ డేట్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కు కుక్క కూడా ఓటేయ్యదని, కేటీఆర్ సిరిసిల్ల చిత్తు పేపర్ గా మిగిలిపోతుందని, కల్వకుంట్ల కుటుంబాన్నీ నమ్మే రోజులు పోయాయని, తెలంగాణలో బీజేపీ లేదా కాంగ్రెస్ మాత్రమే పవర్ లోకి వస్తుందని ధర్మపురి అరవింద్ అన్నారు.
Next Story

