Sun Mar 15 2026 13:25:34 GMT+0530 (India Standard Time)
31న జేపీ నడ్డా రాక
ఈ నెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు

ఈ నెల 31వ తేదీన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతుండటంతో బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు సయితం ఇక్కడ ఎక్కువ సార్లు పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వరస పర్యటనలతో...
ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ముందుకు వెళుతున్న నేపథ్యంలో తెలంగాణలోనే ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్న వ్యూహంలో కమలనాధులున్నారు. ముఖ్యనేతలతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సభలు, సమావేశాలతో పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన మార్గాలను వెతుక్కుని మరీ వెళ్లాలని జేపీ నడ్డా నేతలకు సూచించనున్నారు.
Next Story

